Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ కెప్టెన్ కావడం అతి పెద్ద పొరపాటు.. ఎందుకంటే? (video)

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (10:26 IST)
బీజేపీ నేతలకు నోటి దురుసు ఎక్కువనే టాక్ వుంది. ఈ జాబితాలో ప్రస్తుతం టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా చేరినట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజాలపై సంచలన కామెంట్లు చేసేందుకు వెనుకాడని గంభీర్.. ప్రస్తుతం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలు గుప్పించాడు.
 
గతంలో తాను టీమిండియాలో స్థానం కోల్పోవడానికి ధోనీయే కారణమంటూ అనేకసార్లు ధ్వజమెత్తిన గంభీర్ ఈసారి ధోనీపై పాజిటివ్‌గా స్పందించడం విశేషం. మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా కెప్టెన్ కావడం అతి పెద్ద పొరపాటు అంటూ ముక్తాయించిన గంభీర్ తన ఉద్దేశమేమిటో వెంటనే వివరించాడు. 
 
టీమిండియా సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోని పేరు చెప్పగానే దేశవిదేశ ఆటగాళ్లు, అభిమానులు అందరూ మెచ్చుకునేది అతడి నాయకత్వ లక్షణాలను. ప్రత్యర్థి వ్యూహాలను చేధిస్తూ.. క్లిష్ట సమయాలలో కూల్‌గా నిర్ణయాలను తీసుకుని టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. అయితే ఎంఎస్‌ ధోని కెప్టెన్‌ కావడంతో క్రికెట్‌ ప్రపంచం ఓ గొప్ప బ్యాట్స్‌మన్‌ను చూసే అవకాశం కోల్పోయిందని గౌతమ్‌ గంభీర్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. 
 
ధోని కెప్టెన్ కావడంతో క్రికెట్ ప్రపంచం ఓ అద్భుత బ్యాట్స్‌మన్‌ను కోల్పోయిందన్నాడు. అతను భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్ చేయలేదు. మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసుంటే ధోనిలోని ఓ భిన్నమైన ఆటగాడిని క్రికెట్‌ ప్రపంచం చూసేదని వ్యాఖ్యానించాడు.

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments