Aeroplane Celebration: రవూఫ్‌కు కౌంటరిచ్చిన బుమ్రా.. డిప్పింగ్ ఫ్లైట్ సంబరాలు.. వీడియో వైరల్ (video)

సెల్వి
సోమవారం, 29 సెప్టెంబరు 2025 (07:38 IST)
Bumrah
ఆసియా కప్‌ను వివాదాలు వదలట్లేదు. ఈసారి భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పాకిస్తాన్ ఆటగాడు హరిస్ రౌఫ్ వికెట్ తీసుకుని, డిప్పింగ్ ఫ్లైట్ సైగ చేశాడు. ఈ చర్య చర్చలకు దారితీసింది. ఈ సీన్ మైదానంలో భారీగా చప్పట్లు కొట్టేందుకు దారి తీసింది. 
 
గత ఆదివారం దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో, సంజు సామ్సన్‌ను అవుట్ చేసిన తర్వాత రౌఫ్ ఫైటర్ జెట్ సైగ చేశాడు. తరువాత బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. రవూఫ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలింది.

ఈ చర్యలకు అతనికి మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా కూడా విధించబడింది. తాజాగా.. బుమ్రా వికెట్ తీసిన సమయంలో మిసైల్ సంబరాలు చేసుకొని హారిస్ రవూఫ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
మరోవైపు టీమిండియా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి తొమ్మిదవ ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. విజయం కోసం 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 4-30 గణాంకాలతో రాణించడంతో, తిలక్ వర్మ అజేయంగా 69 పరుగులతో భారత్ రెండు బంతులు మిగిలి ఉండగానే తమ లక్ష్యాన్ని చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

తర్వాతి కథనం
Show comments