Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా హెడ్ కోచ్‌గా మళ్లీ #RaviShastri: టీ-20 ప్రపంచకప్ దక్కేనా?

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (19:04 IST)
టీమిండియా హెడ్ కోచ్ పదవి మళ్లీ రవిశాస్త్రికే దక్కింది. కపిల్ దేవ్ నాయకత్వంలోని అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో తదుపరి కోచ్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించిన సంగతి తెలిసిందే.


ఈ ఇంటర్వ్యూల్లో క్రికెట్ సలహా కమిటీ మళ్లీ రవిశాస్త్రికే పట్టం కట్టింది. కెప్టెన్‌ కోహ్లీ బహిరంగంగానే రవిశాస్త్రికి తన మద్దతు ప్రకటించడంతో.. రవిశాస్త్రికి మళ్లీ కోచ్ పదవి వరించింది. 
 
ఇక కొత్త కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతాడు. అలాగే భారత్ ఆతిథ్యమిచ్చే 2021 ట్వంటీ-20 ప్రపంచ కప్ వరకు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఈ సందర్భంగా కపిల్‌దేవ్‌ మాట్లాడుతూ భారత ఆటగాళ్లపైన, ఇతర అన్ని అంశాలపై రవిశాస్త్రికి పూర్తి అవగాహన ఉందని తెలిపారు. 
 
కాగా, రవిశాస్త్రి కోచ్ సారథ్యంలోనే ఇంగ్లండ్ గడ్డపై జరిగిన వన్డే ప్రపంచ కప్‌ను భారత్ కోల్పోయింది. ఇక రెండేళ్ల పాటు కొనసాగే రవిశాస్త్రి, టీ-20 ప్రపంచ కప్‌నైనా సంపాదించిపెడతాడో లేదో అనేది వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments