Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్లాస్టిక్‌ను నిషేదిద్ధాం.... దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు

ప్లాస్టిక్‌ను నిషేదిద్ధాం.... దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు
, గురువారం, 15 ఆగస్టు 2019 (15:53 IST)
భారతదేశ 73వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ పిలుపునిచ్చారు. దేశంలో ప్లాస్టిక్‌ను నిషేదిద్ధామంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని, ఈ అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్లాస్టిక్ వాడాకాన్ని మానేందుకు శపథం తీసుకుందామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా మోడీ ప్రసంగించారు. మహాత్మాగాంధీని స్మరిస్తూ ఇంటాబయట ఉన్న ప్లాస్టిక్‌ను సేకరించి, దాన్ని పురపాలికలో పోగు చేయాలి. ఆ దిశగా అక్టోబర్ 2 నుంచి తొలి అడుగువేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసేందుకు ఏం చేద్దామో ఆలోచించాలని అంకుర సంస్థలను, సాంకేతిక నిపుణులను, ఉద్యమకారులను కోరుతున్నాను. 
 
రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్ వాడుతున్నాం. ఆ విధంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి. కానీ ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్నో సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ప్లాస్టిక్ విముక్తి కోసం ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉంది. ప్లాస్టిక్ సంచులు అడగొద్దని బోర్డులు పెట్టాలని దుకాణాదారులను కోరారు. 
 
భూమాత ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి అని విజ్ఞప్తి చేశారు. భారీగా రసానియక ఎరువులు, పురుగు మందుల వాడకం ద్వారా భూమాతను నాశనం చేస్తున్నాం. భూమాత బిడ్డలుగా, రైతులుగా భూమాతను దెబ్బతీసే అధికారం మనకు లేదు. భూమాతను ఏడిపించే, రోగగ్రస్తం చేసే హక్కు లేదు. పొలాల్లో 10, 20, 25 శాతం రసాయనిక ఎరువుల వాడకం తగ్గిద్దాం.. వీలైతే పూర్తిగా నిషేధిద్దాం అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ న్యాయవ్యవస్థకు ఒక ప్రత్యేక స్థానం : ఏపీ హైకోర్టు యాక్టింగ్ సీజే