కోహ్లీ బయోపిక్‌లో హీరోహీరోయిన్లు ఫిక్స్, అలా అయితే ఓకే..

Webdunia
మంగళవారం, 19 మే 2020 (19:47 IST)
గత కొద్దికాలంగా బయోపిక్స్ హవా బాగానే నడుస్తోంది. కేవలం చనిపోయినవారి జీవితాలనే కాకుండా బ్రతికి ఉన్న ప్రముఖులపై కూడా ఇప్పుడు చాలానే బయోపిక్స్ వచ్చి హిట్‌లు సాధించాయి. వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ రావడంతో దర్శకనిర్మాతలు కూడా వీటిపై మొగ్గు చూపుతున్నారు. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ కూడా రావచ్చనే వార్త చక్కర్లు కొడుతుండటంతో దీనిపై తాజాగా విరాట్ కూడా స్పందించాడు.
 
సాధారణంగా బయోపిక్ అంటే వారి జీవితంలో జరిగిన వాస్తవాలను తెరకెక్కించాలి, కానీ కొన్ని సందర్భాలలో కాంట్రవర్సీలతో కొన్ని మధ్యలోనే ఆగిపోతే, మరికొన్ని అద్భుతమైన ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను నమోదు చేసాయి. ముఖ్యంగా క్రీడాకారుల బయోపిక్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. టీమిండియా జట్టు మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోని బయోపిక్ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇక సచిన్, అజారుద్దీన్, కపిల్ బయోపిక్‌లు కూడా వచ్చాయి.
 
ఇప్పుడు నంబర్ వన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి వార్తలు వస్తుండటంతో స్పందించిన విరాట్ తన బయోపిక్‌లో తానే హీరోగా నటించడానికి ఇష్టపడతానని, అంతేకాకుండా ఆ కథలో హీరోయిన్‌గా అనుష్క శర్మ మాత్రమే ఉండాలని, అలాంటప్పుడే నా బయోపిక్‌కు ఓకే చెప్తానని విరాట్ కండిషన్ పెట్టాడు. మరి కోహ్లి కండీషన్‌కు ఒప్పుకుని దర్శకనిర్మాతలు ఎలా తీస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరున విలపించిన ఎర్రబెల్లి - రాజకీయాల్లో ఉండాలా వద్దా అంటూ కంటకన్నీరు...

ప్రతిరోజూ బిస్కెత్తులు వేస్తున్న మహిళనే కరిచిన వీధికుక్కలు, వీడియో చూడండి

వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా అమర్చి రికార్డు చేశారు.. కన్నడ నటి ఫిర్యాదు

చంద్రబాబు విజన్‌ను బిల్‌గేట్స్ ప్రశంసించడాన్ని జగన్ జీర్ణించుకోలేకున్నారు : మంత్రి పార్థసారథి

మార్చి 3వ తేదీన శ్రీవారి ఆలయం మూసివేత - ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు కీలక రూలింగ్... సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాల్సిందే...

Suhas: హే బల్‌వంత్‌ సినిమా చూసి నా వైఫ్‌ ఫుల్‌ ఎంజాయ్‌ చేసింది : సుహాస్‌

Soumith Rao,: మా నిలవే సక్సెస్ మాకు బాహుబలి లాంటిది : సౌమిత్ పోలాడి

నా భుజానికి చిన్న కీ-హోల్ సర్జరీ జరిగింది : చిరంజీవి

తర్వాతి కథనం
Show comments