Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యాడ్మింటన్ ఆటగాడితో ప్రేమలో పడిన తాప్సీ ...

Advertiesment
బ్యాడ్మింటన్ ఆటగాడితో ప్రేమలో పడిన తాప్సీ ...
, సోమవారం, 11 మే 2020 (20:49 IST)
తెలుగు వెండితెరకు పరిచయమైన ఢిల్లీ భామ తాప్సీ. 'ఝుమ్మంది నాదం' అనే చిత్రం ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ ఢిల్లీ భామ ప్రేమ వ్యవహారం బహిర్గతం చేసింది. ఓ బ్యాడ్మింటన్ క్రీడాకారుడుతో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టు తెలిపారు. 
 
తెలుగులో ఈ అమ్మ‌డికి అంత స‌క్సెస్‌లు లేక‌పోయిన హిందీలో మాత్రం భారీ విజ‌యాల‌ని త‌న ఖాతాలో వేసుకుంది. ఇక తాప్సీ ప్రేమ‌లో ఉంద‌ని కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న‌ప్ప‌టికీ, ఏ రోజు దానిపై నోరు విప్ప‌లేదు. కానీ తాజాగా త‌న బాయ్‌ఫ్రెండ్‌ని కుటుంబ స‌భ్యుల‌కి ప‌రిచ‌యం చేసి వాళ్ళు ఓకే చెప్పాక ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది.
webdunia
 
తాను ప్రేమిస్తున్నది ఓ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథియాస్ బోతో అని చెప్పింది. త‌న ప్రేమ‌ని త‌ల్లిదండ్రులు అంగీక‌రించినందుకే ఈ విషయాన్ని బహిర్గతం చేసినట్టు చెప్పారు. లేదంటే ఇప్ప‌టికీ మౌనంగా ఉండాల్సి వ‌చ్చేది. ఇన్నాళ్లు నా ప్రేమ‌ని దాచ‌డానికి కార‌ణం న‌టిగా నాకంటూ ప్ర‌త్యేక గుర్తింపు రావాల‌నుకోవ‌డం. ముందే చెప్పుంటే గ‌త ఏడాది సాధించిన విజ‌యాలు నాకు ద‌క్కేవి కావేమో. ఇక నేను ఎవ‌రితోనో రిలేష‌న్‌లో ఉన్నాన‌నే విష‌యం నా కుటుంబానికి తెలుసు. నా త‌ల్లిదండ్రులు, సోద‌రీమ‌ణులు ఇష్ట‌ప‌డ‌ని వ్య‌క్తిని నేను అంగీక‌రించ‌లేను అని తాప్సీ చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ్యాడ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్, మ్యాడ్ స్టోరీ ఏంటి?