Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ్యాడ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్, మ్యాడ్ స్టోరీ ఏంటి?

Advertiesment
Mad story movie first look release
, సోమవారం, 11 మే 2020 (20:44 IST)
ప్రస్తుత జనరేషన్‌ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం "మ్యాడ్". ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆసక్తికరంగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ అందరిని ఆకర్షిస్తోంది. మోదెల టాకీస్  బ్యాన‌ర్ పైన టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు మిత్రులు నిర్మాత‌లుగా లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమాలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ లీడ్ రోల్స్ ప్లే చేశారు.
 
8వ తేదీ రిలీజ్ చేసిన ఫ్రీలుక్‌కి చాలా మంచి రెస్పాన్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. మన చుట్టూ జరుగుతున్న కొన్ని జీవితాల నుండి ప్రేరణ పొంది అంతే సహజంగా ఈ కథని చెప్పడం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న ఒక జంట, లివింగ్ రిలేషన్లో ఉన్న మరోజంట జీవితాల్లో ఎలాంటి మలుపులు జరిగాయన్నది హృద్యంగా చెప్పడం జరిగింది. చిత్ర కథనం, సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి.
 
ఈ సినిమా చూసే ప్రేక్షకులకి నిత్యం మనకి తారసపడే మోడరన్ జంటల లైఫ్ స్టైల్‌ని చూస్తున్న ఫీల్ కలుగుతుంది అని ఈ సంద‌ర్బంగా డైరెక్టర్ లక్ష్మణ్ మేనేని తెలియచేసారు.
 
 హీరోహీరోయిన్లు వారివారి పాత్ర‌ల్లోకి ఇమిడిపోయి చాలా సహజంగా న‌టించారు. ఈ సినిమాకి రెహమాన్ స్కూల్ నుండి వచ్చిన మోహిత్ రెహ్మానియాక్ అందించిన సంగీతం బాగా  ఆక‌ట్టుకుంటుంది. పద్మశ్రీ కైలాష్ ఖేర్ ఇష్టపడి పాడిన సూఫీ పాట చిత్రానికి మరో హైలైట్‌గా నిలుస్తుంది.
 
ఈ చిత్రం కాన్సెప్ట్ గురించి తెలుసుకుని, పాటలు విన్న వెంటనే 'మధుర' ఆడియో వారు తాము రిలీజ్ చేస్తామని ముందుకు రావడంతో ఈ నెల 14వ తేది ఫస్ట్ సింగల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. కొత్త నటీనటులు, టెక్నీషియన్లతో నిర్మించిన 'మ్యాడ్' ఈ తరం ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాం అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థియేటర్స్‌కి కొత్త రూల్స్, ఇదే జరిగితే.. సినీ ప్రియులకు పండగే..!