Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో ట్వంటీ20 మ్యాచ్ : పోరాడి ఓడిన యంగ్ ఇండియా

Webdunia
గురువారం, 29 జులై 2021 (09:32 IST)
లంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆతిథ్య శ్రీలంక జట్టుతో జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో పోరాడి ఓడింది. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో లంక జట్టు విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం చేసింది. ఈ సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో మ్యాచ్ గురువారం జరుగనుంది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కొత్త కుర్రాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (21), దేవదత్ పడిక్కల్ (29) పర్వాలేదనిపించినా నితీశ్ రాణా (9) సంజు శాంసన్ (7) దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ ధావన్ 40 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో దనంజయ 2, చమీర, హసరంగ, దాసున్ శనక చెరో వికెట్ తీసుకున్నారు.
 
ఆ తర్వాత 133 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు... మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. లంక విజయంలో మినోద్ భానుక (36), ధనంజయ డి సిల్వా (40-నాటౌట్) ప్రధాన భూమిక పోషించారు. 
 
అవిష్క ఫెర్నాండో 11, హసరంగ 15, చమిక కరుణరత్నె 12 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీసుకున్నారు. 
 
జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డి సిల్వను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇక సిరీస్ లో తదుపరి మ్యాచ్ గురువారం రాత్రి కొలంబో వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారినే సిరీస్ విజయం వరిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

తర్వాతి కథనం
Show comments