Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ : భారత హాకీ జట్టు ఖాతాలో మరో గెలుపు

Webdunia
గురువారం, 29 జులై 2021 (09:09 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత హాకీ జట్టు ఖాతాలో మరో గెలుపు వచ్చి చేరింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాపై భారత్ విజయం సాధించింది. గ్రూప్‌-ఏ నాలుగో మ్యాచ్‌లో 3-1తో విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌ తొలి క్వార్టర్ ముగిసేసరికి 0-0తో ఇరుజట్లు ఖాతా తెరవలేదు. అయితే మ్యాచ్‌ 43వ నిమిషంలో భారత ఆటగాడు కుమార్‌ వరుణ్‌ తొలి గోల్‌ చేసి జట్టును 1-0తో లీడ్‌లో నిలిపాడు. అయితే కొద్ది సేపట్లోనే (మ్యాచ్‌ 48వ నిమిషంలో) అర్జెంటీనా ఆటగాడు మైకో కసెల్లా తన జట్టుకు తొలి గోల్‌ అందించాడు. 
 
ఫలితంగా ఇరుజట్ల స్కోర్‌ సమమైంది. ఆ తర్వాత మ్యాచ్‌ 58వ నిమిషంలో ప్రసాద్‌ వివేక్‌ సాగర్‌ రెండో గోల్‌ చేయడంతో  భారత జట్టుకు ఆధిక్యం లభించింది. ఇక 59వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ మూడో గోల్ చేసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. నాలుగో క్వార్టర్‌లోనే భారత్‌ రెండు పాయింట్లు సాధించడం విశేషం. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments