Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేరు, ట్యాగ్‌లైన్, లోగోలు పంపండి.. లక్షలు గెలవండి.. ఆసక్తికరమైన పోటీ

Advertiesment
పేరు, ట్యాగ్‌లైన్, లోగోలు పంపండి.. లక్షలు గెలవండి.. ఆసక్తికరమైన పోటీ
, బుధవారం, 28 జులై 2021 (16:25 IST)
name, tagline, logo,
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఓ ఆసక్తికరమైన పోటీ పెట్టింది. అందులో గెలిచినవారు లక్షల్లో బహుమతులు పొందొచ్చునని తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం ఇటీవల డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్సిస్టి‍ట్యూషన్‌(డీఎఫ్ఐ)కి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీని తీరుతెన్నులు, లక్ష్యాలను స్పూరించే విధంగా పేరు, లోగోలతో పాటు ట్యాగ్‌లైన్‌ను సూచించాలని ఆర్ధిక శాఖ ప్రజల్ని కోరుతోంది.
 
దేశ సంస్కృతి ఉట్టిపడేలా, ప్రజలందరికీ అర్ధమయ్యే రీతిలో డీఎఫ్ఐ పేరు, ట్యాగ్‌లైన్‌, లోగోలు ఉండాలని.. ఆగష్టు 15వ తేదీ సాయంత్రం 5.30 గంటల్లోగా ఆసక్తి కలిగినవారు తమ ఎంట్రీలను పంపించాలని తెలిపింది. ఈ పోటీలో ఒక్కో విభాగంలో మొదటి స్థానంలో నిలిచినవారికి రూ. 5 లక్షలు, రెండో స్థానానికి రూ. 3 లక్షలు, మూడో స్థానానికి రూ. 2 లక్షలు బహుమతులుగా అందజేస్తామన్నారు.
 
దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రజలందరికీ తేలికగా అర్థమయ్యేలా పలకడానికి సులువుగా ఉండేలా డీఎఫ్‌ఐకి సంబంధించిన పేరు, ట్యాగ్‌లైన్, లోగోలు ఉండాలని తెలిపింది. పేరు, ట్యాగ్‌లైన్, లోగో డిజైన్లు రూపొందించిన వారు https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution లింక్ ద్వారా కేంద్రానికి ఎంట్రీలను పంపాల్సి ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Flash Floods: జమ్ము-కాశ్మీర్‌లో వరదలు.. ఏడుగురు మృతి