Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు దెబ్బకొట్టింది.. ఓటమి జీర్ణించుకోలేనిది : విరాట్ కోహ్లీ

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (12:02 IST)
మొహాలీ వేదికగా జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించడంపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి చెందడంతో చాలా బాధేస్తోందన్నారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. 358 పరుగుల భారీ లక్ష్యాన్ని పర్యాటక ఆస్ట్రేలియా జట్టు అలవోకగా ఛేదించింది. 
 
ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, తమ ప్రదర్శన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా మంచు గురించి మా అంచనా తప్పయింది. మంచు వల్ల చివర్లో మా బౌలర్లకు అసలు పట్టు చిక్కలేదు. అయితే దీనిని మా ఓటమికి సాకుగా చెప్పను. ఆఖరి ఓవర్లలో ఐదు అవకాశాలు వృథా కావడం జీర్ణించుకోలేనిది. స్టంపింగ్‌ అవకాశం చేజారింది. ఫీల్డింగ్‌ బాగా లేదు. డీఆర్‌ఎస్‌ను సందేహించాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చింది. అస్టన్‌ టర్నర్‌, ఖవాజా, హ్యాండ్స్‌కోంబ్‌ల అద్భుతంగా ఆడారు. ప్రత్యర్ధి జట్టు మా కన్నా బాగా ఆడింది. వరుసగా రెండు మ్యాచ్‌ల ఫలితాలతో మా కళ్లు తెరచుకున్నాయి. ఈ మ్యాచ్‌ ఫలితం మరో మాటకు తావు లేకుండా మమ్మల్ని చాలా బాధపెడుతోంది' అని చెప్పుకొచ్చరు. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు శిఖర్ ధవాన్ (143), రోహిత్ శర్మ (95) అద్భుతంగా రాణించడంతో తొలి వికెట్‌కు రికార్డు స్థాయి భాగస్వామ్యం నెలకొల్పారు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు కూడా తమ వంతు సహకారం అందించడంతో 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. 
 
అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఆసీస్‌ను పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ (105 బంతుల్లో 117, 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ఉస్మాన్‌ ఖాజా (99 బంతుల్లో 91; 7 ఫోర్లు)లు కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకోగా.. చివర్లో ఆస్టన్‌ టర్నర్‌ (43 బంతుల్లో 84 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి జట్టును గెలిపించాడు. దీంతో ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు 2-2 సమం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌పై దాడికి వందల కొద్దీ అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయ్ : పాక్ మంత్రి హెచ్చరికలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

తర్వాతి కథనం
Show comments