Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో దాయాదుల పొట్టి సమరం - పీసీబీ వెల్లడి

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (16:11 IST)
అయితే కొన్నాళ్లుగా రెండు దేశాల మ‌ధ్య ఉన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ ప్ర‌భావం క్రికెట్‌పైనా ప‌డింది. అప్పుడ‌ప్పుడూ ఐసీసీ టోర్నీల్లో ఆడ‌ట‌మే త‌ప్ప రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జ‌ర‌గ‌డం లేదు. ఈ నేపథ్యంలో ఇండోపాక్ క్రికెట్ అభిమానుల‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
 
ఈ యేడాది ఆఖరులో భారత్, పాకిస్థాన్ మ‌ధ్య టీ20 సిరీస్ జ‌ర‌గ‌నున్న‌ట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి వెల్ల‌డించారు. ఈ చారిత్ర‌క‌ సిరీస్ కోసం సిద్ధంగా ఉండాల‌ని త‌మ‌కు ఆదేశాలు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. 
 
ఈ వార్త‌ను అక్క‌డి మీడియా ప్ర‌ముఖంగా చూపించింది. ఒక‌వేళ ఈ సిరీస్ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే ఇండియ‌న్ టీమ్ పాకిస్థాన్‌కు రావాల్సి ఉంటుంద‌ని పీసీబీ వ‌ర్గాలు తెలిపాయి. 
 
చివ‌రిసారి ఈ రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్ జ‌రిగినప్పుడు పాకిస్థాన్ టీమ్ ఇండియాకు వ‌చ్చింది. చివ‌రిసారి ఈ రెండు దేశాల మ‌ధ్య 2012-13లో జ‌రిగింది. అయితే, ఇటు బీసీసీఐ, అటు పీసీబీ అధికారుల మధ్య ఇంతవరకు చర్చలు జరగలేదు. 

సంబంధిత వార్తలు

ఎగ్జిట్ పోల్స్ నోట - కోమటి పల్స్ మాట

కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్ నిజమైతే వైఎస్ఆర్‌సిపి పరిస్థితి ఏంటి?

ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. తెలంగాణ ఎవరు టాప్.. ఎవరికి ఎన్ని సీట్లు?

పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు: ఆరా మస్తాన్ exit polls (video)

ఎగ్జిట్ పోల్స్.. ఏపీలో టీడీపీ.. జాతీయ స్థాయిలో ఎన్డీయేకే పట్టం..

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

తర్వాతి కథనం
Show comments