Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్-పాకిస్థాన్‌ల దాయాది పోరు.. ఎప్పుడో తెలుసా? (Video)

భారత్-పాకిస్థాన్‌ల దాయాది పోరు.. ఎప్పుడో తెలుసా? (Video)
, గురువారం, 25 మార్చి 2021 (12:08 IST)
దాయాదుల క్రికెట్ సమరానికి రంగం సిద్ధమవుతోంది. చివరి సారిగా 2012-13లో పాక్ వేదికగా రెండు జట్లు మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ జరిగింది. ఆ తర్వాత 2008లో ఆసియా కప్‌ కోసం భారత్ పాక్‌లో పర్యటించింది. చివరగా ఇరు జట్లు 2019 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఈ నేపథ్యంలో చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ కోసం పాక్ ప్రభుత్వం సన్మహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఈ ఏడాదిలో ద్వితీయార్థంలో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగేలా ప్రయాత్నాలు చేయాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు ఆ దేశ ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పాక్‌ స్థానిక మీడియాలో తన కథనాలలో పేర్కొంది. 
 
రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరు జట్లు మధ్య సిరీస్‌లు జరగడం అగిపోయింది. దేశాల మధ్య పర్యటనలు కూడా అగిపోయింది. కేవలం ఐసీసీ టోర్నీల్లో, ఆసియా కప్‌లో మాత్రమే ఈ రెండు జట్ల బరిలోకి దిగుతున్నాయి. 
 
ఈ వివాదాలకు ముగింపు పలకాలని త్వరలో రెండు జట్ల మధ్య సిరీస్ జరిగిలే ప్రయత్నాలు చేస్తున్నట్లు పీసీబీ అధికారి స్పష్టం చేశాడు. 2023లో పాక్‌లో నిర్వహించే ఆసియా కప్‌లో భారత్‌ ఆడుతుందనే తాము ఆశిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్‌ మని ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీకి డేవిడ్ లాయిడ్ వార్నింగ్.. పసుపు, ఎర్ర కార్డులు ఇవ్వాలి.. లేకుంటే..?