Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పర్యటనకు సౌతాఫ్రికా జట్టు ఎంపిక.. డుప్లెసిస్‌కు చోటు

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (13:46 IST)
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడ వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇందుకోసం క్రికెట్ సౌతాఫ్రికా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. 
 
ఈ సిరీస్‌లో మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌‌కు చోటుకల్పించారు. అంటే ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేయనున్నాడు. అతనితో పాటు రాస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ కూడా ఇండియాతో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. వీరిద్దరూ ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపికవ్వలేదు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ జార్జ్‌ లిండే.. ఇండియాతో జరిగే వన్డే సిరీస్‌తో వన్డేల్లో ఆరంగేట్రం చేయనున్నాడు. 
 
ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో భాగంగా, తొలి మ్యాచ్‌ 12న ధర్మశాలలో జరగనుండగా.. రెండో మ్యాచ్‌ 15న లక్నోలో, మూడో మ్యాచ్‌ 18న కలకత్తాలో జరగనున్నది. కాగా, డుప్లెసి రాకతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలోపేతం కానుంది.
 
సౌతాఫ్రికా జట్టు వివరాలు.. క్వింటన్‌ డీ కాక్ ‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), టెంబా బావుమా, రాస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌, కైల్‌ వెర్రైన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, జోన్‌-జోన్‌ స్ముట్స్‌, ఫెలిక్వాయో, లుంగి ఎంగిడి, లుతో సిపమ్లా, బ్యూరాన్‌ హెండ్రిక్స్‌, ఆన్రిచ్‌ నార్ట్‌జే, జార్జ్‌ లిండే, కేశవ్‌ మహరాజ్‌. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments