Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత పర్యటన విలువైనది.. మోదీ గ్రేట్ గై.. డొనాల్డ్ ట్రంప్

Advertiesment
Donald Trump
, ఆదివారం, 1 మార్చి 2020 (17:05 IST)
భారత పర్యటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఈ మధ్యే ట్రంప్ సతీమణి మెలానియా కూడా తన ఇండియా విజిట్ ని, భర్తతో కలిసి తన తాజ్ మహల్ సందర్శనను, ఢిల్లీ స్కూల్లో విద్యార్థులతో తను గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. ట్విట్టర్ ద్వారా తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో భారత పర్యటన విలువైన విజిట్ అని ట్రంప్ అన్నారు. మాటిమాటికీ భారత పర్యటనను గుర్తు చేసుకుని ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇంకా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. 
 
అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో లక్షలాది ప్రజలు హాజరయ్యారని, ఆ కార్యక్రమంలో తాను పాల్గొనడం మరువరానిదని.. చెప్పారు. భారత ప్రధాని మోదీతో కలిసి తాను ఈ ఈవెంట్లో పాల్గొన్నానని.. అది అద్భుతమైన ఘటన అంటూ చెప్పుకొచ్చారు. 
 
అసలు ప్రధాని మోదీని భారత ప్రజలు ఎంతగా అభిమానిస్తున్నారో, ఆరాధిస్తున్నారో తెలుసుకున్నా.. అంటూ.. మోదీని ''గ్రేట్ గై'' గా అభివర్ణించారు. భారత పర్యటన, అహ్మదాబాద్ వంటి క్రేజ్ తనకు ఎప్పుడూ తారసిల్లలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత జనాలకు మోదీ గొప్పనాయకుడని కొనియాడారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్‌తో మేలు జరిగిందా? ఎలా?