చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ : మళ్లీ టాస్ ఓడిన భారత్... కివీస్ బ్యాటింగ్

ఠాగూర్
ఆదివారం, 9 మార్చి 2025 (14:51 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా, ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల ఫైనల్ మ్యాచ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ మరోమారు టాస్ ఓడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ, టాస్ ఏదేనా తాము పట్టించుకోబోమన్నారు. 
 
గతంలోనూ తాము ఛేజింగ్ చేసి అన్ని మ్యాచ్‌లు గెలిచామని ఈ సందర్భంగా రోహిత్ గుర్తుచేశారు. అంతిమంగా ఎలా ఆడామన్నదే ముఖ్యమన్నారు. టాస్ ఎలా పడినా బాధపడొద్దని డ్రెసింగ్ రూమ్‌లోనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 
 
న్యూజిలాండ్ జట్టు గత కొన్నేళ్లుగా మెరుగైన ఆటతీరును కనబరుస్తోందని, ముఖ్యంగా, ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు నాణ్యమైన ఆట ఆడుతోందన్నారు. ఇపుడు అలాంటి టీమ్‌తో ఫైనల్ ఆడుతున్నామని, ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని రోహిత్ శర్మ వెల్లడించారు. అయితే, కివీస్ జట్టులో మాత్రం పేసర్ మాట్ హెన్రీ స్థానంల నాథన్ స్మిత్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. 
 
దీంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన కివీస్ తొలి నాలుగు ఓవర్లలోనే 27 పరుగులు రాబట్టింది. ఓపెనర్లు యంగ్ 9, రచిన్ రవీంద్ర 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన తుది జట్ల విరాలను పరిశీలిస్తే,
 
భారత్ : రోహిత్, గిల్, కోహ్లి, శ్రేయాస్, అక్షర్ పటేల్, రాహుల్, పాండ్యా, జడేజా, షమీ, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి
 
న్యూజిలాండ్ : విలియమ్సన్, మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రాస్‌వెల్, సాట్నర్, కైలే జెమిసన్, రూర్కే, నాథన్ స్మిత్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆయన మా డాడీయే కావొచ్చు.. కానీ ఈ యాత్రలో ఆయన ఫోటోను వాడను : కవిత

త్వరలో వందే భారత్ 4.0 : రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

తమిళనాడులోనూ ఎన్డీఏ కూటమి రాబోతోందా? సీఎం అభ్యర్థిగా టీవీకే చీఫ్ విజయ్?

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం

AI Hub: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభంపై ప్రధాని హర్షం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

తర్వాతి కథనం
Show comments