Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో డాన్ బోస్కో చిత్రీకరణ ప్రారంభం

Advertiesment
Rushya, Marna Menon

దేవి

, శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (18:29 IST)
Rushya, Marna Menon
కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో "డాన్ బోస్కో" చిత్రం అధికారిక పూజా కార్యక్రమంతో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. పి.శంకర్ గౌరి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత నాగ వంశీ ముఖ్య అతిథిగా హాజరై.. ముహూర్తం షాట్‌కు నిర్మాత సాహు గారపాటి కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. చుక్కపల్లి సురేష్ క్లాప్ కొట్టారు. చిన్నబాబు స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు.
 
ఈ సందర్భంగా మూవీ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సినిమాలోని పాత్రలు ఎలా ఉంటాయో పోస్టర్‌లో చూపించారు. పోలీస్ స్టేషన్‌లోని మోస్ట్ వాంటెడ్ బోర్డు ఇంట్రెస్టింగా ఉంది. ప్రిన్సిపాల్ విశ్వనాథ్‌గా మురళీ శర్మ  కీలక పాత్ర పోషిస్తున్నారు. లెక్చరర్ సుమతిగా మిర్నా మీనన్ నటిస్తున్నారు. మౌనిక, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, విష్ణు ఓయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
 
"డాన్ బోస్కో" అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. "వెల్‌కమ్ టు ది క్లాస్ రీయూనియన్-బ్యాచ్ 2014", "అన్ని రీయూనియన్లు జ్ఞాపకాల కోసం కాదు; కొన్ని విముక్తికి సంబంధించినవి" అంటూ పోస్టర్‌పై రాసిన క్యాప్షన్‌ ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఎదురురోలు రాజు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు.
 
SIIMA & AHA అవార్డులలో ఉత్తమ డెబ్యూటెంట్ ప్రొడక్షన్ హౌస్ అవార్డును అందుకున్న ఎమర్జింగ్ ప్రొడక్షన్ హౌస్ లౌక్య ఎంటర్టైన్మెంట్స్, శ్రీ మాయ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పనేని, శైలేష్ రామ నిర్మిస్తున్న మూవీ "డాన్ బోస్కో". 
 
నటీనటులు: రుష్య, మర్నా మీనన్, మౌనిక, మురళీ శర్మ, విష్ణు ఓయ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోగ్లీ 2025 చిత్రం రోషన్ కనకాల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం