Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అడివి శేష్‌ G2 లో నటించడం ఆనందంగా, సవాలుగా వుందంటున్న వామికా గబ్బి

Adivi Shesh, Vamika Gabbi

డీవీ

, మంగళవారం, 7 జనవరి 2025 (15:42 IST)
Adivi Shesh, Vamika Gabbi
G2 చిత్రంలో వామికా, అడివి శేష్ సరసన లీడ్‌గా నటిస్తోంది. ఆమె పాత్ర స్పై ప్రపంచానికి ఫ్రెష్  డైనమిక్ లేయర్ ని యాడ్ చేస్తోంది. ఇది హై-ఆక్టేన్ స్పై థ్రిల్లర్. గూడచారికి సీక్వెల్‌ G2. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీతో పాటు వామికా గబ్బి చేరారు. ఈ పవర్‌హౌస్ తారాగణంతో, G2 ట్రూ పాన్-ఇండియా మూవీ రూపొందుతోంది.
 
ఇటీవల అడివి శేష్‌తో యూరోపియన్ షూటింగ్ షెడ్యూల్‌ను ముగించిన వామికా ఈ చిత్రం గురించి ఉత్సాహంగా ఉన్నారు. “G2 అద్భుతమైన ప్రయాణంలో భాగం కావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మొదటి చిత్రం చెప్పుకోదగ్గ బెంచ్‌మార్క్‌ని సెట్ చేసింది, ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడం ఆనందంగా, సవాలుగా ఉంటుంది. ప్రతిభావంతులైన తారాగణం, టీంతో కలిసి పనిచేయడం నాకు స్ఫూర్తినిస్తుంది' అన్నారు  
 
అడివి శేష్, వామికా గబ్బి, ఇమ్రాన్ హష్మీ తో పాటు మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ,  మధు షాలిని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ  యాక్షన్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ డ్రామాతో  సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ప్రామిస్ చేస్తోంది.  
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ -ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై  టి జి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన జి 2 తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మలయాళం పాన్-ఇండియన్ విడుదల కానుంది.
 
పవర్‌హౌస్ తారాగణం, స్పై థ్రిల్లర్ స్టయిల్ ని రీడిఫైన్ చేయనున్న G2 నిస్సందేహంగా అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. G2 త్వరలో పెద్ద స్క్రీన్స్ కి రావడానికి సిద్ధమవుమౌతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Kanguva: ఆస్కార్ రేసులో కంగువ.. సూర్య సినిమాపై మళ్లీ ట్రోల్స్