Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాండ్యా సోదరులకు పితృవియోగం.. గుండెపోటుతో హిమాన్షు పాండ్యా మృతి

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (13:02 IST)
Hardik Pandya
టీమిండియా ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా ఇకలేరు. శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో ఆడుతున్న కృనాల్ పాండ్యా బయో బబుల్‌ను వీడి ఇంటికి చేరుకున్నాడు. హార్దిక్ పాండ్యా.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిశాక స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పాండ్యా సోదరులకు పితృవియోగం తప్పలేదు.
 
పాండ్యా సోదరులను క్రికెటర్లుగా చేయడంలో వారి తల్లిదండ్రుల పాత్ర ఎంతగానో ఉంది. పాండ్యా సోదరుల తండ్రి కూడా కొడుకులను క్రికెటర్లుగా చేయడానికి చాలానే కష్టపడ్డారు. సూరత్ లో కార్ ఫైనాన్స్ వ్యాపారం చేసే హిమాన్షు.. తన కుమారుల కెరీర్ కోసం ఆ వ్యాపారాన్ని వదిలేసి వడోదరకు మార్చారు. టీమిండియా మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె క్రికెట్ అకాడమీలో ఇద్దరినీ చేర్పించి శిక్షణ ఇప్పించారు.
 
హిమాన్షు మరణంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశాడు. ఆయనతో రెండుమూడు సార్లు మాట్లాడానని, ఎప్పుడూ ఎంతో సంతోషంగా ఉండేవారని అన్నాడు కోహ్లీ. జీవితంలో అన్నీ సాధించిన భావన ఆయనలో కనిపించేదని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేలం పాటల్లో రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

తర్వాతి కథనం
Show comments