కొడుకు తప్పు చేస్తే తండ్రి దండించాలి. కానీ ఇక్కడ తండ్రి, కొడుకుతో కలిసి అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. అయామకుల జీవితాలతో ఆడుకోవడమే కాదు. ఎదిరిస్తే ఇక అంతే సంగతులు. అలాంటి ఘటనే అనంతపురం జిల్లాకు చెందిన ఒక వివాహిత కువైట్‌లో ఎదుర్కొంది. చివరకు ఎలాగోలా స్వస్థలానికి చేరుకుంది.
అనంతపురం జిల్లా హిందూపురంకు చెందిన సుగుణ తన భర్తతో కలిసి బెంగుళూరులో ఉండేది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు కూలి పనిచేసేవారు. కానీ సంవత్సరం క్రితం భర్తకు ఒక ప్రమాదంలో కాలు విరిగిపోయింది. దీంతో అతను ఇంటికే పరిమితమయ్యాడు. ఇంటి పోషణ కోసం సుగుణ చేస్తున్న పని ఏమాత్రం సరిపోలేదు. ఆ జీతం చాలక అప్పులు చేయడం మొదలుపెట్టారు.
చివరకు తమ బంధువులు కువైట్‌కు వెళ్ళి బాగా డబ్బులు సంపాదిస్తున్నారని, సుగుణ కూడా అక్కడికే వెళ్ళేందుకు సిద్థమైంది. ఇంటిని అమ్మి లక్ష రూపాయలు సర్ధుకుని కువైట్‌కు వెళ్ళింది. ఆరు నెలల పాటు ఒక అకౌంటెంట్ వద్ద సహాయకురాలిగా పని చేసింది. బాగానే డబ్బులు కూడబెట్టుకుంది. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఉన్నట్లుండి అతను అనారోగ్యంతో చనిపోయాడు.
దీంతో కాంట్రాక్టర్ మరో చోట ఆరునెలలకు పనిని కుదిర్చాడు. కానీ ఈసారి పనికి వెళ్ళిన వ్యక్తులు కామాంధులు. తండ్రి బంగారం వ్యాపారం.. కుమారుడు కూడా అదే పనిచేసేవాడు. ఇంట్లో పనిచేస్తున్న సమయంలో సుగుణతో అసభ్యంగా ప్రవర్తించాడు తండ్రి. స్నానం చేయించమని చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
విషయం బయటకు చెబితే కాంట్రాక్ట్ రద్దవుతుందని.. తానే డబ్బులు చెల్లించుకోవాలని తన బాధను దిగమింగుకుంది. ఇక కొడుకు కూడా అదే పని చేశాడు. ఇద్దరూ కలిసి అత్యాచారం చేస్తుండటంతో ఆ అభాగ్యురాలు ఎవరికి చెప్పినా ఇబ్బందికరంగా మారుతుందని.. తన బాధను మనస్సులోనే ఉంచుకుంది. సరిగ్గా వారంరోజుల క్రితం స్వస్థలానికి వచ్చిన సుగుణ తనకు జరిగిన అన్యాయాన్ని స్నేహితుల సహాయంతో పోలీసులకు చెప్పుకుంది. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదట.