Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా ఫోబియా : కొత్తగా పెళ్లి.. పక్కలోకి వెళ్లని వరుడు.. నపుంసకుడన్న భార్య!

Advertiesment
Coronaphobia
, సోమవారం, 7 డిశెంబరు 2020 (07:30 IST)
ఇపుడు ప్రతి ఒక్కరినీ కరోనా ఫోబియా పట్టిపీడిస్తోంది. చివరకు కొత్తగా పెళ్లి చేసుకున్న వారిని కూడా భయం వదిలిపెట్టడం లేదు. దీంతో కొత్త దంపతులు సైతం శోభనం చేసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. తాజాగా ఓ కొత్తగా పెళ్లిన ఓ జంటకు నెలలు గడుస్తున్నా తొలిరాత్రి జరగలేదు. భార్య చెంతకు వెళ్లాలన్న ఆలోచన భర్తకు రాలేదు. దీంతో భర్త సంసారానికి పనికిరాడని భావించిన భార్య... విడాకుల కోసం న్యాయసేవా సంస్థను ఆశ్రయించింది. అక్కడ భర్తను పిలిచి కౌన్సిలింగ్ చేస్తేగానీ అసలు విషయం తెలియలేదు. కరోనా వైరస్ సోకుతుందన్న భయంతోనే భార్య పక్కలోకి వెళ్లలేదని చెప్పడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భోపాల్‌కు చెందిన ఓ యువకుడు ఈ యేడాది జూన్ 29వ తేదీన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి కరోనా భయంతో భార్య వద్ద భౌతిక దూరం పాటించసాగాడు. నెలలు గడుస్తున్నా భర్త దగ్గరికి రాకపోవడంతో అనుమానించిన భార్య అతడు సంసారానికి పనికిరాకపోవడం వల్లే తనతో దూరంగా ఉంటున్నాడని అనుమానించింది. 
 
ఈ క్రమంలో భర్తను వదిలిపెట్టి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఈ నెల 2న ఆమె న్యాయసేవా సంస్థను ఆశ్రయించి.. తన భర్త సంసారానికి పనికిరాడని, నపుంశకుడు కావడంతో తనతో శారీరక సంబంధం పెట్టుకునేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిపింది. 
 
కాబట్టి అతడి నుంచి తనకు భరణం ఇప్పించాలని కోరింది. తనతో మాట్లాడేటప్పుడు కూడా భౌతిక దూరం పాటిస్తున్నాడని పేర్కొంది. అంతేకాదు, తన అత్తమామలు కూడా తనను హింసిస్తున్నారని ఆరోపించింది.  
 
ఆమె ఫిర్యాదుతో స్పందించిన అధికారులు ఆమె భర్తకు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించి అతడిని తమ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అతడు చెప్పింది విని విస్తుపోయారు. కరోనా భయం కారణంగానే భార్యకు దూరంగా ఉంటున్నానని చెప్పాడు. 
 
వివాహం జరిగిన వెంటనే తన భార్య కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకింది, ఆ భయంతోనే ఆమెకు దూరంగా ఉంటున్నాను తప్పితే మరేమీ లేదని చెప్పడంతో కౌన్సెలర్లు ఆశ్చర్యపోయారు. 
 
తనకు వైరస్ సోకుతుందన్న భయం అతడిలో పాతుకుపోయిందని, తన భార్యలో రోగనిరోధకశక్తి అధికంగా ఉండడంతో ఆమెలో లక్షణాలు బయటపడడం లేదని అతడు విశ్వసిస్తున్నట్టు చెప్పాడని కౌన్సెలర్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏలూరులో వింత వ్యాధి.. పిట్టల్లా పడిపోతున్న జనం.. సీఎం సమీక్ష.. గవర్నర్ ఆరా!