Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీకి పుట్టిన రోజు.. రికార్డుల రారాజు.. సచిన్ తర్వాత అతనే..

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (10:26 IST)
Kohli
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి నేడు పుట్టినరోజు. భారత క్రికెట్‌లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్న కోహ్లీ.. టీమిండియాకు సారథ్య పగ్గాలను సమర్థవంతంగా నిర్వర్తించాడు. కానీ అతని కెరీర్‌లో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా గతేడాది ఫామ్‌లో లేడని విమర్శలు ఎదుర్కొన్నాడు. 
 
కెప్టెన్సీ పోవడం, ఫామ్ కోల్పోవడం, మూడేళ్లుగా సెంచరీ లేకపోవడంతో కోహ్లీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఓ సమయంలో కొందరు.. కోహ్లీ పని అయిపోయిందన్నారు. అతడు రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదన్నారు.
 
అయితే కోహ్లీ తిరిగి ఆసియా కప్‌లో ఫామ్‌లోకి రావడంతో అతడిపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాడు. ఆసియా కప్‌లో అతను మెరుపు సెంచరీ చేశాడు. ఈ టీ20 వరల్డ్ కప్‌తో కోహ్లీ మరింత ఫామ్‌లోకి వచ్చాడు.
 
ముఖ్యంగా పాకిస్థాన్‌పై అతడు అడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ మరిచిపోలేనిది. పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌పై 53 బంతుల్లో 4 సిక్స్‌లు, 6 ఫోర్లతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై కూడా అర్థ సెంచరీని సాధించాడు. బంగ్లాదేశ్‌పై కూడా హాఫ్ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 102 టెస్టులు ఆడి 8,704 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 
 
26 వన్డేలు ఆడిన కోహ్లీ 12,334 పరుగులు చేశాడు. ఇందులో 43 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20 మ్యాచ్‌ల విషయానికొస్తే 113 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 3,932 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ 15 ఏళ్ల వయసులో క్రికెట్‌‍లోకి అడుగుపెట్టాడు. 
 
2008లో అండర్ 19 ప్రపంచ కప్‌‌కి కెప్టెన్‌‌గా వ్యవహరించాడు. ఆపై అంచలంచలుగా ఎదుగుతూ 2008లో అండర్ 19 ప్రపంచ కప్‌కి కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. అప్పుడే అండర్ 19 ప్రపంచ కప్‌ను సాధించి పెట్టాడు. ఇదే కోహ్లీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. రంజీ ట్రోఫీ ఆడే సమయంలో తన తండ్రి చనిపోయినప్పటికీ మ్యాచ్‌ను ఆడాడు. ఒంటి చేత్తో టీమ్‌ను గెలిపించి క్రికెట్ పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నాడు. 
 
2008లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నీలో వంద పరుగులు తర్వాత టీమిండియాకు కోహ్లీ ఎంపికయ్యాడు. అలాగే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరూ గాయపడినప్పుడు 2008లో శ్రీలంకతో ఆడిన ఐడియా కప్ ద్వారా తొలిసారిగా వన్డే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అతడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన ప్రతిభ చాటుతూ ధోనీ తర్వాత కెప్టెన్సీ సారథ్యం చేపట్టాడు. 
 
అప్పటి నుంచి టీమిండియా విజయాలను అందించాడు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో వరుసగా ఐదు అర్థ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఈ ఫీట్ అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఆపై ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కోహ్లీ టెస్టుల్లో ఏడో స్థానంలో వున్న భారత జట్టును నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చాడు. 
 
అతి తక్కువ కాలంలో అత్యధిక విజయాలు అందించిన భారత్ కెప్టెన్ కూడా విరాటే. అయితే ఆపై బీసీసీఐ విభేదాలతో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కానీ కోహ్లీ ప్రపంచ క్రికెట్ చరిత్రలో రికార్డుల రారాజుగా పేరుంది. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేసే వారు ఎవరైనా వున్నారంటే అది కోహ్లీనేనని చెప్పాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పేర్ని నాని భార్య జయసుధకు ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు

"మా అత్తను త్వరగా చంపు తల్లీ" అంటూ కరెన్సీ నోటుపై రాసి హుండీలో వేశారు... (Video)

Perni Nani: పేర్ని నాని భార్య జయసుధకు నోటీసులు..

Pawan Kalyan: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసల జల్లు

మరణశాసనం రాసిన మద్యంమత్తు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిలీప్ శంకర్ ఇక లేరు.. హోటల్ గది నుంచి దుర్వాసన రావడంతో..?

పూరీ జగన్నాథ్ New Resolution 2025, సోషల్ మీడియా దెయ్యంను వదిలేయండి

Pushpa 2: 23 ఏళ్ల ఖుషీ రికార్డును బ్రేక్ చేసిన పుష్ప 2.. టిక్కెట్ల తేడా వుందిగా..!?

ఫతే ప్రచారంలో సోనూ సూద్‌కి పంజాబ్ లో నీరాజనాలు

బాపు నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో చిత్రం

తర్వాతి కథనం
Show comments