Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మాటకు విలువ లేదు.. ఈ కెప్టెన్సీ నాకొద్దు : మహ్మద్ నబీ

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (08:45 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా సూపర్ -12 పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ టోర్నీలో పాలుపంచుకుంటున్న జట్లలో ఆప్ఘనిస్థాన్ కూడా ఉంది. అయితే, ఈ జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. శుక్రవారం బలమైన ఆస్ట్రేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. అంటే ఆ జట్టు ఆడిన మొత్తం 5 మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. 
 
మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. గ్రూపు దశలో ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో అట్టడు స్థానంలో నిలిచింది. ఈ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు కెప్టెన్ మహ్మద్ నబీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రటించారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, "గత యేడాది కాలంగా మా జట్టు సన్నాహాలు ఓ పెద్ద టోర్నీకి అవసరమైన స్థాయిలో లేవు. ఓ కెప్టెన్‌గా నా మాటకు విలువ లేకుండా పోయింది. ఇటీవల కొన్ని పర్యటనల్లో జట్టు మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీ, నాకు మధ్య సమన్వయం కొరవడింది. దాంతో జట్టులో సమతూకం కొరవడింది. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్‌గా తక్షణం వైదొలుగుతున్నాను. 
 
జట్టు మేనేజ్‌మెంట్, జట్టు ఎపుడూ నా సేవలు కోరుకున్నా అందించడానికి సర్వదా సిద్ధం. ఈ ప్రపంచ కప్‌‍లో కొన్ని మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. మా కోసం మైదానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ప్రేమాభిమానాలు మాకెంతో విలువైనవి" అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments