శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దేవాలయంలో వంటగదిలోని బాయిలర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఆలయంలోన్ని అన్నపూర్ణ భవన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అల్పాహారం తయారీకి ఉపయోగించే వంటగదిలో స్టీమ్ వాటర్ బాయిలర్ ఒక్కసారిగా పేలిపోయింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో అక్కడున్న ఆలయ సిబ్బంది పాటు భక్తులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. నిత్య అన్నదానం బయటవేపు ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. అయితే, బాయిలర్ పేలిపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
మరోవైపు, కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులు శ్రీశైలం ఆలయానికి పోటెత్తారు. దీంతో ఆలయంలోని కంపార్టుమెంట్లతో పాటు క్యూలెన్సు నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు రద్దీ మొదలైంది. దీంతో భక్తులు అసౌకర్య కలగకుండా ఆలయ అధికారులు క్యూలైన్లలో వేచివున్నవారికి పాలు, ప్రసాదం అందించారు. వీటిని తయారు చేసే వంట గదిలోనే పేలుడు చోటుచేసుకోవడం గమనార్హం.