Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలీప్ జోషి ఇకలేరు..

ఠాగూర్
మంగళవారం, 24 జూన్ 2025 (08:18 IST)
భారత క్రికెట్ రంగంలో విషాదం నెలకొంది. భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, సీనియర్ క్రికెటర్ దిలీప్ జోషి ఇకలేరు. గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన లండన్‌లో తుదిశ్వాస విడిచారు. భారత్ తరపున 33 టెస్టులు, 15 వన్డేలు ఆడిన జోషి... టెస్టు క్రికెట్‌‍లో 114 వికెట్లు పడగొట్టారు. 30 యేళ్ళ వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. గత కొన్నేళ్లుగా ఆయన లండన్‌లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య కళిందీ, కుమారుడు నయన్, కుమార్తె విశాఖ ఉన్నారు. 
 
దిలీప్ జోషి మృతిపట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మాజీ భారత స్పిన్నర్ దిలీప్ జోషి లండన్‌లో మరణించడం చాలా విచారకరం. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలి అని బీసీసీఐ సోషల్ మీడియాలో ఎక్స్ ఖాతాలో పేర్కొంది. గత 1947 డిసెంబరు 22వ తేదీన అప్పటి రాజ్‌కోట్ సంస్థానంలో జన్మించిన దిలీప్ జోషి.. తన అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌లో మంచి ప్రావీణ్యంపొంది గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
తన 30 యేళ్ళ వయసులో 1979 సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జోషి... 1979 నుంచి 1983 మధ్యకాలంలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. మొత్తం 33 టెస్ట్ మ్యాచ్లు, 15 వన్డేలు ఆడారు. టెస్ట్ క్రికెట్‌లో 30.71 సగటుతో మొత్తం 114 వికెట్లు నేలకూల్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments