Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌.. టీమిండియా అదరగొడుతుందా?

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (18:44 IST)
ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు తొలిసారి అవకాశం లభించిన విషయం తెలిసిందే. బర్మింగ్‌హామ్‌ వేదికగా ఈనెల 28న ఈ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. 
 
పురుషుల క్రికెట్‌లో భాగంగా కోలాలంపూర్‌ వేదికగా జరిగిన 1998 కామన్వెల్త్‌ గేమ్స్‌లో క్రికెట్‌కు తొలిసారి ప్రాతినిధ్యం లభించగా.. అందులో దక్షిణాఫ్రికా స్వర్ణ పతకం నెగ్గింది.
 
50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 16 జట్లు 4 గ్రూప్‌లుగా విభజింపబడి పోటీపడగా.. సఫారీలు స్వర్ణాన్ని, ఆసీస్‌ రజతాన్ని, కివీస్‌ కాంస్య పతకాన్ని గెలిచాయి. అప్పట్లో గ్రూప్‌-బిలో తలపడిన భారత్‌ గ్రూప్‌ దశలోనే (3 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే గెలుపు) నిష్క్రమించి ఓవరాల్‌గా 9వ స్థానంలో నిలిచింది.
 
నాటి టీమిండియాకు అజయ్‌ జడేజా సారధ్యం వహించగా.. అనిల్‌ కుంబ్లే వైస్‌ కెప్టెన్‌గా.. సచిన్‌, లక్ష్మణ్‌ కీలక ప్లేయర్లుగా ఉన్నారు. కీలక ప్లేయర్లు పాకిస్థాన్‌తో సహారా కప్‌ ఆడుతుండటంతో బీసీసీఐ రెండో జట్టును కామన్వెల్త్‌ గేమ్స్‌కు పంపింది. ఇకపోతే.. మహిళల క్రికెట్‌ ద్వారా కామన్వెల్త్‌లో అడుగుపెట్టబోతున్న టీమిండియా వుమెన్స్ టీమ్ ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

తర్వాతి కథనం
Show comments