దేశ ఆర్థిక రాజధాని ముంబైను స్వైన్ ఫ్లూ వైరస్ వణికిస్తుంది. ఇప్పటికే 62 మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం అధికారికంగా వెల్లడించింది.
జనవరి ఒకటో తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు మొత్తం 166132 మందికి స్వైన్ ఫ్లూ నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 62 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలిందని, మహాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గౌరి రాథోడ్ వెల్లడించారు.
స్వైన్ ఫ్లూ సోకిన వారిలో థానే జిల్లాకు చెందిన ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ముంబై రీజియన్‌లో హెచ్1ఎన్1 వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన తొలి మృతులు ఇవేనని చెప్పారు.
అలాగే, ఈ నెల 18వ తేదీన జ్యోతి రాజా (51), బబితా హేట్ (72) అనే మహిళ జూలై 19న ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీరిద్దరికీ స్వైన్ ఫ్లూ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని తెలిపారు.