Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ ఎన్నికల్లో మోర్తాజా.. సూపర్ ఫామ్‌లో వుండగా అవసరమా?

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (16:40 IST)
బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ ముష్రఫె మోర్తాజా (35) రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నాడు. కానీ మోర్తాజా ఇప్పుడే రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాడనేది ప్రస్తుతం చర్చనీంయాశమైంది. క్రీడాకారులు రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వస్తుంటారు. అయితే మోర్తాజా మాత్రం... సూపర్ ఫామ్‌లో వుండగానే రాజకీయ తెరంగేట్రం చేయనున్నాడు. 
 
ఈ మేరకు వచ్చేనెలలో జరగనున్న ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడనే విషయాన్ని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. మోర్తాజాకు రాక్‌స్టార్‌గా మంచి గుర్తింపు వుంది. అందుకే అతనిని రంగంలోకి దించేందుకు అధికార అవామీ లీగ్ పార్టీ సన్నద్ధమైంది. 
 
ఇంకా అధికార అవామీ లీగ్ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావాలన్న మోర్తాజా నిర్ణయానికి హసీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపారు. సొంత జిల్లా అయిన పశ్చిమ బంగ్లాదేశ్‌లోని నరైలీ నుంచి పోటీ చేయాలని మోర్తాజా భావిస్తున్నట్టు చెప్పారు. 
 
అలాగే రాజకీయాల్లోకి వెళ్లాలన్న క్రికెటర్ల ప్రయత్నాన్ని అడ్డుకోబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. మోర్తాజా నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం అతడి నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments