Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజారుద్ధీన్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు.. బెల్‌ను మోగించడం ఏంటి?

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (08:55 IST)
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాజీ సారథి, భారత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహ్మద్ అజారుద్దీన్‌పై గంభీర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈడెన్ గార్డెన్స్‌లోని బెల్‌ను మోగించడమేంటని మండిపడ్డాడు. ఆదివారం భారత్-విండీస్ మధ్య  జరిగిన తొలి ట్వంటీ-20కి ముందు అజారుద్ధీన్ గంట మోగించి మ్యాచ్‌ను ప్రారంభించడం ఏమిటని గంభీర్ తీవ్రంగా తప్పుబట్టాడు. 
 
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిచినా.. బీసీసీఐ, సీవోఏ, సీఏబీ మాత్రం ఓడిపోయాయని.. అవినీతి వ్యతిరేక పాలసీకి ఆదివారం మంగళం పాడారని గంభీర్ తెలిపాడు. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ పడే అవకాశం అతడికి (అజార్) ఇచ్చారని తెలుసు. 
 
కానీ బెల్ మోగించే అవకాశం కూడా ఇవ్వడం తనను షాక్‌కు గురిచేసిందని గంభీర్ ట్వీట్ చేశాడు. గంభీర్ ట్వీట్‌ను కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అజార్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments