నాన్నా.. రేప్ అంటే ఏమిటి? అని అడుగుతారేమోనని భయంగా ఉంది...
దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా, పసిమొగ్గల నుంచి పండు ముదుసలి శీలానికి రక్షణ లేకుండా పోయింది. దేశంలో ఏదో ఒక చోట రేప్ లేదా సామూహిక అత్యాచార ఘటనలు జరుగుతూన
దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా, పసిమొగ్గల నుంచి పండు ముదుసలి శీలానికి రక్షణ లేకుండా పోయింది. దేశంలో ఏదో ఒక చోట రేప్ లేదా సామూహిక అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పందించారు.
భవిష్యత్‌లో నా పిల్లలు 'రేప్'కు అర్థమేంటని అడుగుతారేమోనని భయమేస్తోంది. ఇద్దరు ఆడపిల్లల తండ్రిని అయినందుకు ఓవైపు ఆనందంగా, మరోవైపు ఆందోళనగా ఉంది. చిన్న పిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారని వార్తాపత్రికల్లో మొదటి పేజీల్లో వస్తున్నాయని గుర్తుచేశాడు.
అంతేనా, ప్లే స్కూళ్లలోనూ పిల్లలకు మంచి స్పర్శ ఏదో, చెడు స్పర్శ ఏదో చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. చదువుకునే రోజుల్లో అమ్మాయిలు నాకు ఎన్ని రాఖీలు కడితే అంత సంబరపడేవాణ్ని. ఇప్పుడు అలాంటి సోదరసోదరీమణుల బంధాన్ని ప్రోత్సహించగలరా? అంటూ ట్వీట్ చేశాడు.