బీసీసీఐ తీరు ఇదేనా? ఐపీఎల్‌పై వున్న శ్రద్ధ.. టెస్టుల మీద లేదే: గంభీర్
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చూపుతున్న ఆసక్తి అంతా ఇంతా కాదని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ విమర్శించారు. క్రికెట్ చరిత్రకారుడు బ
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చూపుతున్న ఆసక్తి అంతా ఇంతా కాదని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ విమర్శించారు. క్రికెట్ చరిత్రకారుడు బొరియా మజుందార్ రాసిన ఎలెవన్ గాడ్స్ అండ్ బిలియన్ ఇండియన్స్ పుస్తకావిష్కరణలో పాల్గొన్న గంభీర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
బీసీసీఐ తీరును తప్పుబట్టిన గంభీర్.. ఐపీఎల్‌ను మార్కెట్ చేసే బీసీసీఐ టెస్టుల విషయంలో మాత్రం ఏ మాత్రం శ్రద్ధ చూపట్లేదని విమర్శలు గుప్పించాడు. వన్డేలు, ట్వంటీ-20ల మార్కెట్ కోసం తాపత్రయపడుకున్నంతగా టెస్టు క్రికెట్‌ను మార్కెట్ చేసేందుకు బీసీసీఐ ఆసక్తి చూపట్లేదనిపిస్తోందని గంభీర్ వ్యాఖ్యానించాడు.
ఇందుకు 2011లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో విండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచే ఇందుకు ఉదాహరణ. ఆ మ్యాచ్‌లో తొలిరోజు భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టేడియంలో ఉన్నది వెయ్యిమందేనని గంభీర్ గుర్తు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి ఆటగాళ్లు ఆడుతున్న మ్యాచ్‌ను వెయ్యి మంది మాత్రమే చూస్తున్నారంటే.. ఎలా ఉంటుందో ఊహించండని పేర్కొన్నాడు.