Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెటర్ల కంటే వారే గొప్ప విజేతలు: గౌతమ్ గంభీర్

ఏషియాడ్ అథ్లెట్లే నిజమైన హీరోలని టీమిండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ కొనియాడాడు. అడ్డంకులను అధిగమించి విజయాలు సాధించారని, క్రికెటర్ల కంటే వారే గొప్ప విజేతలని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఏషియాడ్‌లో భారత

క్రికెటర్ల కంటే వారే గొప్ప విజేతలు: గౌతమ్ గంభీర్
, బుధవారం, 5 సెప్టెంబరు 2018 (17:56 IST)
ఏషియాడ్ అథ్లెట్లే నిజమైన హీరోలని టీమిండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ కొనియాడాడు. అడ్డంకులను అధిగమించి విజయాలు సాధించారని, క్రికెటర్ల కంటే వారే గొప్ప విజేతలని గంభీర్ వ్యాఖ్యానించాడు.


ఏషియాడ్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారని గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పటికే ఏషియాడ్‌లో భారత ఆటగాళ్లు 15 బంగారు పతకాలు, 24 రజత, 30 కాంస్య పతకాలతో మొత్తం 69 పతకాలు సాధించారు. గతంతో పోలిస్తే భారత్‌కు ఇదే అత్యుత్తమం. 
 
క్రికెట్‌ కంటే క్రీడాభిమానుల నుంచి ఇతర క్రీడలకు ఆదరణ లేకున్నప్పటికీ క్రీడాకారులు మాత్రం నిరుత్సాహానికి గురికావడం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా సత్తా చాటుతూనే ఉన్నారు.

తాజాగా ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన 18వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్టు గతంలో ఎన్నడూ లేనంతంగా పతకాలు కొల్లగొట్టి రికార్డు సృష్టించారు. వివిధ అంశాల్లో తొలిసారి బంగారు పతకాలు సాధించి చరిత్రను తిరగరాశారు. ఈ నేపథ్యంలో భారత అథ్లెట్లపై గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్విజ్ మాస్టర్ ఓడిపోయాడా? అదీ అన్‌సీడెడ్ ప్లేయర్ చేతిలోనా?