Webdunia - Bharat's app for daily news and videos

Install App

గబ్బాకోటను బద్ధలు కొట్టారు.. టీమిండియాకు జగన్ ప్రశంసలు..

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (18:58 IST)
సంప్రదాయ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అజింక్య రహానే సారథ్యంలోని యువజట్టు అద్భుత పోరాట పటిమతో పటిష్ట ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. గబ్బాలో నేడు ముగిసిన నాలుగో టెస్టు తర్వాత తాజా టెస్టు ర్యాంకింగ్స్‌ను ఐసీసీ విడుదల చేసింది.
 
117.65 రేటింగ్ పాయింట్లతో భారత జట్టు రెండో స్థానానికి ఎగబాకగా, ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 113 పాయింట్లతో మూడో స్థానానికి దిగజారింది. 118.44 పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 
 
ఇదిలా ఉంటే.. గబ్బా స్టేడియం వేదికగా యంగ్ టీమిండియా గర్జించింది. అథిత్య జట్టు ఆస్ట్రేలియాపై భారత్‌ దుమ్మురేపింది. 31 ఏండ్లుగా ఓటమి ఎరుగుని కంగరూలను కంగు తినిపించింది. భారత జట్టు చరిత్ర తిరగారాసింది. ఈ టోర్నీలో టీమిండియా కుర్రాళ్లు కసిగా.. సమిష్టిగా రాణించారు.
test team india


దీంతో భారత జట్టుకు చారిత్రాత్మక విజయం సాధించారు. అందరూ డ్రాగా ముసుగుస్తుందన్న మ్యాచ్‌లో వీరోచితంగా ఆడి కంగరుల గడ్డపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. టోర్నీని 2-1తో నాలుగు టెస్టుల సిరీస్‌ను, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. 
 
ఈ చారిత్రక విజయాన్ని అందుకున్న టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. దేశవ్యాప్తంగా క్రీడా వర్గాలతో పాటు రాజకీయ నేతలు కూడా అభినందల వర్షం కురిపిస్తున్నారు. ఇదే కోవలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్ కూడా టీమిండియా విజయాన్ని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. 
 
ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన విజయంపై సీఎం జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఓ అద్భుతమైన విజయం, ఈ గెలుపుతో మూడు దశాబ్దాల తర్వాత గబ్బా కోటను బద్దలు కొట్టినందుకు టీమ్‌ ఇండియాకు హార్ధిక శుభాకాంక్షలు అంటూ జగన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. పట్టుదల, పరాక్రమంతో దేశాన్ని గర్వపడేలా చేశారంటూ జగన్ భారత జట్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో జగన్‌ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments