Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామ రక్ష .. రాష్ట్ర స‌రిహ‌ద్దుల వ‌ద్ద 18 చెక్‌పోస్టులు

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (12:34 IST)
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సహకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ శుచి, శుభ్రత పాటించటంతో కొన్ని ముందు జాగ్రత్తలు పాటించాలని సీఎం ప్రజలను కోరారు. ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష అని, వాటిని పాటించి మనల్ని మనం కాపాడుకుందాం.. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఆరోగ్యంగా ఉంచుదామని సీఎం విజ్ఞప్తి చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారిపై గురువారం అత్యున్న‌త స‌మావేశం అనంత‌రం ఆయ‌న ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. 
 
ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలకు ప్రజలను అనుమతించవద్దు. ఎక్కువ మంది గుమికూడకుండా ఉండటమే కరోనా కట్టడికి ముఖ్యసూత్రం.. జగ్‌నేకి రాత్‌ని కూడా రద్దు చేసుకుంటామని ముస్లీంలు అంగీకరించారు. 
 
ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు ఇప్పటికే రద్దు చేశాం. గ్రామాల పారిశుద్ధ్యానికి కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి ఒక కమిటీని వేశాం. విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా వారిపై నియంత్రణ ఉంటుంది. 84 రైళ్లు రాష్ట్రం నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. సరిహద్దు రాష్ట్రాల్లో 18 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నాం. 
 
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. జాగ్రత్తలు తీసుకున్న చోట వైరస్‌ వ్యాపించడం లేదు. గ్రామ పారిశుద్ధ్యం, పట్టణ పారిశుద్ధ్యం పాటించి మనల్ని మనం కాపాడుకుందాం. షాదీఖానాలు, ఫంక్షన్‌హాల్స్‌ అన్ని ఇవాళ్టి నుంచి మూసివేస్తున్నామని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments