Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాస్కుల ధరలు పైపైకి..! మంగళగిరిలో నిలువుదోపిడి

Advertiesment
మాస్కుల ధరలు పైపైకి..! మంగళగిరిలో నిలువుదోపిడి
, గురువారం, 19 మార్చి 2020 (14:09 IST)
అనుకున్నదే అయింది. కరోనా అనుమానిత కేసు నేపథ్యంలో మాస్కులు ధరలకు రెక్కలు వచ్చాయి. రూ.2 నుంచి రూ.5కే దొరికే సాధారణ మాస్కుల ధరలను మందుల దుకాణదారులు ప్రజలకు అందుబాటులో లేని ధరలకు అమ్ముతున్నారు. ఒక్కో మాస్కును రూ.20 నుంచి రూ.25కు అమ్ముతున్నారు. 
 
మరోవైపు కృత్రిమ కొరత సృష్టిస్తూ డిమాండ్‌కు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల నుంచి మాస్క్‌లు, హ్యాండ్‌వాష్‌ శానిటైజర్‌లకు డిమాండ్ పెరిగిపోతోంది. ఒక్కోసారి వీటి కోసం తిరగని మందుల దుకాణం అంటూ ఉండడం లేదు. ఒక్కోషాపునకు రోజుకు పదుల సంఖ్యలో ప్రజలు వీటి కోసం తిరుగుతున్నారు. 
 
జిల్లా ఔషధ నియంత్రణాధికారులు ఇటీవల కంటి తుడుపుగా దాడులు చేసి మిన్నకుండిపోయారు. దాడులు జరిగినా యధావిధిగా మాస్కులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మరోవైపు శానిటైజర్లు అయితే అసలు దొరకని పరిస్థితి నెలకొంది. కరోనా ప్రభావం పడడంతో శానిటైజర్ల వాడకం ఎంతో కీలకంగా మారుతోంది. 
 
కాగా, అధికారులకు అందిన సమాచారం మేరకు పట్టణంలో 40 మంది వరకు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్లు తెలిసింది. వారి వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేగాక కరోనా కేసుతో మరింత విస్త్రతంగా సర్వే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాపై చిరంజీవి ప్రచారం.. వీడియో రిలీజ్