ఒమిక్రాన్ డేంజర్ బెల్స్ - 60 వేలు దాటిన పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (09:51 IST)
ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదఘంటికలు మోగిస్తుంది. ప్రపంచంలో రోజువారీగా నమోదవుతున్న ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతంది. ఇప్పటివరకు ఏకంగా 62 వేలు దాటిపోయాయి. 
 
నిజానికి గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్నాం. ఆ తర్వాత కరోనా డెల్టా వేరియంట్‌తో అమెరికా వంటి అగ్రదేశాలు తల్లడిల్లిపోయాయి. ఇపుడు కొత్తగా ఒమిక్రాన్ వైరస్ పురుడుపోసుకుంది. తొలుత సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వైరస్.. క్రమంగా ఇపుడు 90కు పైగా దేశాలకు వ్యాపించింది. 
 
తాజా లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 62 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో మరోమారు డేంజర్ బెల్స్ మోగడం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, బ్రిటన్‌లో ఒక్కరోజే ఏకంగా 10 వేల ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా, ఈ దేశంలో ఒమిక్రాన్ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో యూకే పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. 
 
ప్రస్తుతం యూకేలో 37,101 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు ఉండగా, డెన్మార్క్‌లో 15,452, నార్వేలో 2,060, భారత్‌లో 152, సౌతాఫ్రికాలో 1247 చొప్పున పాజిటివ్ కేసులు ఉన్నాయి. అమెరికాలో కూడా ఈ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల రాకపోకలపై ఆయా దేశాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని వంద దేవుళ్లు చిత్రం నుంచి మెలోడీ గీతం విడుదల

Faria Abdullah: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా గాయపడ సింహం నుంచి బ్రైడ్ సాంగ్

సై ఫై థ్రిల్లర్ మూవీ కిల్లర్ నుంచి డా. పూర్వజ్ ఫస్ట్ లుక్

ఏ మతాన్ని తక్కువ చూపించలేదు : టొవినో థామస్- కెరీర్ లో స్పెషల్ మూవీ: కయదు లోహర్

King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments