ఆర్య నుంచి స్టయిలిష్ స్టార్ నుంచి పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ పుష్ప విషయంలో మొదటి నుంచి పడిన అనుమానం నిజమేనని తెలుస్తోంది. ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు. మేకప్, యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. అన్నీ చేశాడు. ఒకటి మరిచాడు. అదే కథ. సినిమా విడుదల అవుతుండగా ప్రమోషన్‌లో పలు రాష్ట్రాలు తిరిగాడు. కానీ తెలుగు మీడియా ముందు ఈసినిమా ఓ ప్రయోగం చేశాం. ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే పలుసార్లు ప్రస్తావించాడు. అప్పుడు కొందరికి డౌట్ వచ్చింది.
పైగా అల్లు అర్జున్ ఇంటర్వ్యూలో కూడా అలవైకుంఠపురం, రంగస్థలం సినిమాలు ఎందుకు అంత బ్లాక్ బస్టర్ చేశారో మాకు అర్థం కాలేదు. హిట్ అవుతుందని అనుకున్నాం. కానీ ఊహించని దానికంటే గిఫ్ట్ ఇచ్చారు అని స్పష్టం చేశాడు. అందుకే పుష్పపై మొదటినుంచి అనుమానంతో ప్రయోగం చేశామని చెప్పాడు. పాపం అందులో ఆయన తప్పేమీ లేదు.
కాగా, ఈ సినిమా విడుదలరోజు తెల్లవారి జామున 4గంటలకు షోలు హైదరాబాద్‌లో పడ్డాయి. ఆ తర్వాత 7.30 గంటలకు కూడా షోలు వేశారు. కానీ దానికి థియేటర్ సగం కూడా నిండలేదు. ఇక మామూలు థియేటర్లలో ఐమాక్స్ మాత్రం ఫుల్ అయ్యాయి. సినిమా తర్వాత అక్కడ ఫేక్ మీడియాతో ఆహా! ఓహో! అంటూ తెగ ప్రచారం చేసేవారు. దాన్నే పబ్లిక్‌టాక్‌గా పి.ఆర్.ఓ.లు మార్చేశారు.
సరే. ఇదిలా వుంటే.. సోషల్‌మీడియా పుష్ప సినిమాపై హాట్ టాపిక్‌గా మారింది. అల్లు ఫ్యాన్సే మేం నిరుత్సాహపడ్డాం అంటే మరికొందరు పుష్ప ఫైర్ అనుకున్నాం. కానీ ఫ్లవర్ అయిందంటూ కామెంట్లు పెట్టారు. ఇంకొందరైతే ఛత్రపతి సినిమాను అటూ ఇటూగా మార్చి తీశాడు సుకుమార్ అన్నారు. ఇంకోవైపు.. ఫుష్ప కాదు.. పు స ప.. సప్తగా వుందంటూ.. కామెంట్లు చేశారు.
మామూలుగా అల్లు అర్జున్ సినిమాలంటే సోషల్ మీడియాలో పెద్దగా నెగెటివ్ కనిపించదు. కానీ ఈసారి అలా కనిపించడానికి కారణం సుకుమార్ చేసిన ప్రయోగమే అంటూ విమర్శిస్తున్నారు.