దేశంలో కొత్తగా 46 వేల కేసులో.. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34 శాతం

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (10:01 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరోమారు పెరిగింది. కిందటి రోజుతో పోల్చితే ఈ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,951 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
 
తాజాగా 60,729 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ ప్రభావంతో మరో 817 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,03,62,848కు పెరిగింది. వైరస్‌ నుంచి మొత్తం 2,94,27,330 బాధితులు కోలుకున్నారు. 
 
ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 3,98,454 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 5,37,064కు చేరాయి. మరో వైపు టీకా డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటివరకు 33,28,54,527 డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది. 
 
ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 96.92 శాతానికి పెరిగిందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34శాతంగా ఉందని, ఇప్పటివరకు 41.01 కోట్ల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా జీవితంలో ఆ కథ ముగిసిపోయింది : మంచు లక్ష్మి

నటి ప్రత్యూషను 10 మందితో గ్యాంగ్ రేప్ చేయించి చంపేసాడు, కుక్కచావు చస్తాడు: తల్లి ఆవేదన

Anupama Parameswaran: క్రేజీ కల్యాణం నుంచి అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే పోస్టర్

Suhas: నా ముందే ఒకాయన సెట్‌లో ఇతన్నెందుకు పిలిచారు అన్నాడు: సుహాస్‌

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments