ఢిల్లీకి చెందిన యువతికి మైక్రోసాఫ్ట్ భారీ నజరానా ప్రకటించింది. మైక్రోసాఫ్ట్‌కు ఎదురైన ఓ సమస్యను గుర్తించి 22 లక్షల రూపాయల నజరానా అందుకుంది. ఆ యువతి పేరు అదితి సింగ్. వయసు 20 యేళ్లు. మెడికల్ ఎంట్రన్స్‌లో సీటు రాకపోవడంతో ఎథికల్ హ్యాకింగ్‌పై దృష్టి సారించిన ఆమె.. ఇప్పటివరకు దిగ్గజ కంపెనీల్లోని సుమారు 40 వరకు బగ్‌లను కనుగొన్నట్లు పేర్కొంది.
అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక పనులన్నీ క్షణాల్లో అయిపోతున్నాయి. కానీ సెక్యూరిటీ కూడా అంతే పెద్ద సమస్యగా మారిపోయింది. సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడుకోవడం ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారికి ఎదురయ్యే మొట్టమొదటి సమస్య.
దీనికోసం ఎప్పటికప్పుడు తమ సెక్యూరిటీ ప్రోగ్రాంలను మార్చుకుంటూ ఉంటాయి టెక్ కంపెనీలు. అయినప్పటికీ ఒక్కోసారి కొన్ని లోపాలు అలాగే మిగిలి ఉంటాయి. అయితే ఈ లోపాలను గుర్తించిన వారికి నజరానాలు ఇస్తూ తమను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాయి.
తాజాగా మైక్రోసాఫ్ట్‌కు ఎదురైన ఓ సమస్యను గుర్తించి 22 లక్షల రూపాయల నజరానా అందుకుంది ఢిల్లీకి చెందిన 20ఏళ్ల యువతి అదితి సింగ్. మెడికల్ ఎంట్రన్స్‌లో సీటు రాకపోవడంతో ఎథికల్ హ్యాకింగ్‌పై దృష్టి సారించిన ఆమె.. ఇప్పటివరకు దిగ్గజ కంపెనీల్లోని సుమారు 40 వరకు బగ్‌లను కనుగొన్నట్లు పేర్కొంది.
తాజాగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సిస్టంలో రిమోట్ కోడ్ ఎక్స్‌క్యూషన్ బగ్‌ను కనిపెట్టి భారీ నగదు పొందింది. తాను ఇప్పటి వరకు తీసుకున్న నజరానాల్లో ఇదే పెద్దదని అదితి తెలిపింది. కాగా, అదితి మొదటగా ఈ బగ్ గురించి చెప్పినప్పుడు మైక్రోసాఫ్ట్ పట్టించుకోలేదట. బగ్ ఉన్న ప్రోగ్రాంను యూజర్స్ డౌన్‌లోడ్ చేసుకోకపోవడం చూసి తర్వాత లోపాన్ని సరి చేసుకున్నారట.