అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఎలక్ట్రానిక్ తాజాగా తన సర్ఫేస్ సిరీస్‌లో సరికొత్త ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సర్ఫేస్ 4 పేరుతో లాంఛ్ అయిన ఈ ల్యాప్‌టాప్ ధరను రూ. 1,02,999గా నిర్ణయించింది. 13.5 అంగుళాల ఈ బేస్ మోడల్‌లో AMD రైజెన్ 5 4680U ప్రాసెసర్, 8GB RAM, 256GB SSD స్టోరేజ్‌ని అందించింది.
భారత్‌లోని కమర్షియల్, ఎడ్యుకేషన్ కస్టమర్ల అన్ని అవసరాలను తీర్చే విధంగా ఈ ల్యాప్‌టాప్‌ను డిజైన్ చేశారు. ఇది బ్లాక్, ప్లాటినమ్ కలర్ల ఆప్షన్లలో అల్కాంటారా లేదా మెటల్ ఫినిషింగ్‌తో అందుబాటులో ఉంటుంది. దీన్ని గుర్తింపు పొందిన రిటైల్ స్టోర్లు, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లో మైక్రోసాఫ్ట్ AMD రైజెన్, ఇంటెల్ కోర్ చిప్సెట్ వంటి రెండు ఆప్షన్లను చేర్చింది. ఈ ల్యాప్‌టాప్ 13.5 అంగుళాలు, 15 అంగుళాల టచ్‌స్క్రీన్ వేరియంట్లలో లభిస్తుంది.
13.5- అంగుళాల వేరియంట్ ప్రొడక్టివిటీ, పోర్టబిలిటీకి, 15 అంగుళాల వేరియంట్ మల్టీ టాస్కింగ్‌కు అనువుగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ 4లో 11 వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ లేదా AMD రైజెన్ 4000 ప్రాసెసర్ లభిస్తుంది. వీటికి తోడు రేడియన్ గ్రాఫిక్స్ సపోర్ట్ కూడా ఉంటుంది.