Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ కోర్టును ఆశ్రయించిన నీరవ్ మోడీ.. భారత్‌కు అప్పగించొద్దంటూ...

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (09:53 IST)
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఇపుడు లండన్ కోర్టును ఆశ్రయించాడు. తనను భారత్‌కు అప్పగించొద్దంటూ లండన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 
 
గత రెండేళ్లుగా లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉంటున్న నీరవ్ మోదీని భారత్‌కు రప్పించేందుకు సీబీఐ, ఈడీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోమారు లండన్ హైకోర్టును ఆశ్రయించాడు. 
 
గతంలోనూ ఓసారి అప్పీల్ చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఈసారి తమ వాదనలను నేరుగా వినాలని నీరవ్ తరపు న్యాయవాదులు అప్పీలు చేశారు. దీంతో జులై 21న వాదనలు వినేందుకు న్యాయస్థానం అనుమతి నిచ్చింది.
 
కాగా, 19 మార్చి 2019 నుంచి జైలులోనే ఉంటున్న 50 ఏళ్ల నీరవ్.. పలుమార్లు పెట్టుకున్న బెయిలు దరఖాస్తులను ‘ఫ్లైట్ రిస్క్’ను కారణంగా చూపిస్తూ కోర్టు తిరస్కరించింది. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ బంధువు మెహుల్ చోక్సీ ప్రస్తుతం డొమినికాలో పోలీసుల నిర్బంధంలో ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments