Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు రాష్ట్రాల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు రద్దు

Advertiesment
South Central Railway
అసలే కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పిడుగులాంటి వార్తను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఆరు ప్రత్యేక రైళ్లను రెండు వారాలపాటు రద్దు చేసింది. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య గణనీయమైన స్థాయిలో తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 
 
రద్దు చేసిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్టణం - కాచిగూడ, (08561) రైలును రేపటి నుంచి జులై 14వ తేదీ వరకు, కాచిగూడ - విశాఖపట్టణం (08562) రైలును జులై 2 నుంచి 15వ తేదీ వరకు, విశాఖపట్టణం - కడప (07488) రైలును రేపటి నుంచి 14వ తేదీ వరకు, కడప - విశాఖపట్టణం (07487) రైలును 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, విశాఖపట్టణం - లింగంపల్లి (02831) రైలును రేపటి నుంచి 14వ తేదీ వరకు, లింగంపల్లి - విశాఖపట్టణం (02832) రైలును 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమ్మూల్లో మళ్లీ డ్రోన్ల కలకలం.. భద్రతా బలగాల అప్రమత్తం