Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గిన కోవిడ్ కేసులు - పెరిగిన రికవరీ రేటు

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (11:33 IST)
దేశంలో రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి కోలుకుంటున్న బాధితుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 58,077 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,25,36,137కు చేరింది. ఈ కేసుల్లో 4,13,31,158 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 6,97,802 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,07,177 మంది కోవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు. 
 
అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 1,50,407 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని, మరో 657 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అదేసమయంలో రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతోపాటు రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 97.17 శాతానికి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ  వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments