Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా వైరస్ కల్లోలం.. 24గంటల్లో 904మంది మృతి

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (12:57 IST)
భారత్‌లో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రెండవ విడతలో రోజుకో రికార్డు తరహాలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. మరోసారి లక్షదాటాయి రోజువారి కేసుల సంఖ్య... కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గడచిన 24 గంటలలో 1,68,912 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... ఇదే సమయంలో 904 మంది కన్నుమూశారు. ఇక, 75,086 మంది కోలుకున్నారు.
 
దీంతో.. దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,35,27,717కు చేరుకోగా... కోలుకున్నవారి సంఖ్య 1,21,56,529కు పెరిగింది.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 12,01,009గా ఉండగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 1,70,179కు పెరిగింది.
 
దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 89.86 శాతంగా ఉన్నట్టు బులెటిన్‌లో కేంద్రం పేర్కొంది. ఇక, మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.88 శాతంగా ఉండగా... మరణాల రేటు 1.26 శాతంగా ఉంది. మరోవైపు.. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన 'కరోనా' నిర్దారణ పరీక్షల సంఖ్య 11,80,136గా ఉందని.. ఇదే సమయంలో 29,33,418 మంది వ్యాక్సినేషన్‌ అందించినట్టు కేంద్రం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments