తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో వేలాది కేసులు నమోదవుతున్నాయి. కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొల్లిపర మండలంలో లాక్ డౌన్ విధించారు.
కొల్లిపర మండలంలో వారం రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు తహసీల్దార్ పేర్కొన్నారు. ఏప్రిల్ 10 వ తేదీ నుంచి ఈనెల 16 వ తేదీ వరకు వారం రోజులపాటు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మాత్రమే వ్యాపారాలకు అనుమతులు ఇస్తున్నట్టు తహసీల్దార్ పేర్కొన్నారు. హోటల్స్, టీ స్టాల్స్ ను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇటీవలే భట్టిప్రోలు మండలంలో కూడా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.