స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో తన ఉనికిని చాటుకోవాలని తెగ ప్రయత్నిస్తోన్న నోకియా సంస్థ అదరగొట్టే ఫీచర్స్‌తో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గురువారం జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో నోకియా ఎక్స్ 20, నోకియా ఎక్స్ 10 సిరీస్‌లో ఏకంగా ఆరు ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేసింది.
5జీ సపోర్ట్‌తో స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ను జోడించిన ఈ ఫోన్‌లు వచ్చే నెలలో భారత్‌లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఎంట్రీ లెవెల్, మిడ్ రేంజ్, టాప్ లైన్‌లలో మొత్తం ఒక్కో సిరీస్‌లో మూడు రకాల ఫోన్‌ల చొప్పున నోకియా తీసుకొచ్చింది.
నోకియా ఎక్స్ 20 సిరీస్‌లో 8/128, 6/128 జీబీ, నోకియా ఎక్స్ 10లో 6/128 జీబీ, 6/64 జీబీ, 4/128 జీబీ వేరియంట్‌లలో ఫోన్‌లు ఉన్నాయి. ర్యామ్, స్టోరేజ్ కెపాసిటీ ఆధారంగా వాటి ధరలను నిర్ణయించారు.
అన్ని ఫోన్‌లకు 6.6 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 11, 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్, 32 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా, 64+5+2+2 మెగా క్వాడ్ కెమెరా, 4,470 ఎంహచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.