Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో కరోనాతో ఉపాధ్యాయుడు మృతి.. దేశంలో లక్షన్నర కేసులు

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (12:14 IST)
గుంటూరులో కరోనా కారణంగా ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల గుంటూరులో కాసు సాయమ్మ అనే మున్సిపల్‌ స్కూల్‌ టీచర్‌ కరోనాతో మృతి చెందిన ఘటన మరువకముందే.. మరో ఉపాధ్యాయుడు కరోనాతో మృతి చెందారు. జలగం రామారావు మున్సిపల్‌ స్కూల్‌లో మరో ఉపాధ్యాయుడు కరోనా పాజిటివ్‌తో మృతి చెందారు. ఇప్పటికే స్కూల్‌లోని 10 మంది విద్యార్థులకు, టీచర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయం తెలిసిన స్కూల్‌ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. దీంతో ఈనెల 9 వ తేదీ వరకు స్కూలుకు అధికారులు సెలవులను ప్రకటించారు.
 
మరోవైపు భారత్‌లో సెకండ్‌ వేవ్ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు లక్షన్నర దాటుతున్నాయి. ఇవాళ లక్షా 68వేల 975 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనాతో 964 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల సంఖ్య కోటి, 35లక్షల, 27వేల, 780కి చేరగా 12లక్షల, ఒక వెయ్యి, 9 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని కోటి, 21లక్షల, 56వేల, 529 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments