Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపడొద్దండి, కరోనా వ్యాక్సిన్ వల్ల ఏమీ కాదు: రోజా

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (21:21 IST)
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి నియోజకవర్గంలో అక్కడున్న ప్రజాప్రతినిధులు కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యవేక్షిస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో కూడా ఎపిఐఐసి ఛైర్ పర్సన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 
హెల్త్ వర్కర్లకు టీకా వేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. పదిమందికి పైగా కరోనా వ్యాక్సిన్ వేస్తుండగా చూశారు రోజా. టీకా వేసుకున్న తరువాత వారితో స్వయంగా మాట్లాడారు. టీకా వేసుకున్న వెంటనే ఏదైనా శరీరంలో మార్పులు కనిపిస్తున్నాయా.. ఇబ్బంది పడుతున్నారా.. ఆయాసంగా ఉందా.
 
బొబ్బలు వస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. అంటే ఇప్పటికే రకరకాల దుష్ర్పచారాలు జరుగుతున్న నేపథ్యంలో రోజా నేరుగా టీకా వేసుకున్న వారితో మాట్లాడి అనుమానాన్ని నివృత్తి చేసి ప్రజలకు తెలియజేసేలా ప్రసంగించారు. కరోనా టీకాపై రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. వీటిని ఎవరూ నమ్మొద్దండి అని విజ్ఞప్తి చేశారు రోజా. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏమీ కాదన్నారు రోజా.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments