ఆ 2 జిల్లాల్లో కరోనా మృత్యు ఘంటికలు : జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ విజృంభణ

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (13:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది. గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు కరోనాతో మరణించారు. అటు కర్నూలు జిల్లాలోనూ ముగ్గురు ఈ మహమ్మారికి బలయ్యారు. గుంటూరు జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు మరణించగా, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 119కి పెరిగింది. 
 
ఇక, కొత్తగా 462 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 40 మంది, విదేశాల నుంచి వచ్చినవారు 15 మంది ఉన్నారు. దాంతో ఇప్పటివరకు ఏపీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,834కి చేరింది. 129 మందిని డిశ్చార్జి చేయగా, మొత్తం 4,592 మంది కరోనా నుంచి కోలుకున్నట్టయింది. ఇంకా 5,123 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి విజృంభణ మరింత తీవ్రమైంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 713 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అటు రంగారెడ్డి జిల్లాలోనూ ఇవాళ 107 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
 
ఇక, తెలంగాణ వ్యాప్తంగా 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 8,674కి పెరిగింది. తాజాగా 274 మంది డిశ్చార్జి అయ్యారు. ఓవరాల్ గా 4,005 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 4,452 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మరో 7 గురు మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 217కి చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments