Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసిన నైజీరియా

Advertiesment
Nigerian
కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు కనిపెట్టేందుకు పలు ప్రపంచ దేశాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, భారత్, జర్మనీ, చైనా వంటి ఎన్నో దేశాలు ఈ వైరస్‌కు విరుగుడు కనిపెట్టే వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్నాయి. 
 
అయితే, నైజీరియాకు చెందిన శాస్త్రవేత్తల బృందం మాత్రం ఓ వ్యాక్సిన్‌ను కనుగొన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. అడిలెక్ యూనివర్శిటీలోని మెడికల్ వైరాలజీ, ఇమ్యునాలజీ నిపుణుడు డాక్టర్ ఒడడిపో కొలవోల్ ఈ విషయాన్ని వెల్లడించారని 'ది గార్డియన్ నైజీరియా' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 
 
ఆయన నేతృత్వంలోనే వాక్సిన్ ను ఆఫ్రికన్ల కోసం అభివృద్ధి చేశారని తెలిపింది. ఈ వ్యాక్సిన్ ను ఎవరైనా వినియోగించవచ్చని, ఇదేమీ నకిలీ వ్యాక్సిన్ కాదని, శాస్త్రవేత్తల అంకిత భావానికి దక్కిన ఫలితమని ఈ సందర్భంగా కొలవోల్ వ్యాఖ్యానించారు. 
 
ఈ సూదిమందు అందరికీ అందుబాటులోకి రావడానికి మరో ఏడాదిన్నర సమయం పడుతున్నదని, మరిన్ని ట్రయల్స్, విశ్లేషణ చేస్తున్నామని, అధికార వర్గాల నుంచి అనుమతుల కోసం వేచి చూస్తున్నామని ఆయన తెలిపారు.
 
ఆఫ్రికా మొత్తం విస్తృతంగా వెతికి సార్స్ కోవ్-2 జీనోమ్‌ను గ్రహించి, ఎన్నో ప్రయోగాలు చేశామని, శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారని, ప్రపంచానికి ఈ వ్యాక్సిన్ ఎంతో అవసరమని ఈ సందర్భంగా కొలవోల్ వ్యాఖ్యానించారు. 
 
కాగా, భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలైన గ్లెన్ మార్క్‌, హెటిరో, సిప్లా కంపెనీలు కరోనాకు మాత్రలతో పాటు... సూది మందులను కనుగొన్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ప్రతి కటుంబానికి 90 రోజుల్లో కోవిడ్‌ పరీక్షలు: జగన్‌